రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 22, నేటిధాత్రీ:
రామకృష్ణాపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ లో నివాసముండే గుడిసె కొమురయ్య నివసించే గృహం బుధవారం షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం అయ్యింది. కొమురయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ శ్రేణులు గురువారం కొమురయ్య కుటుంబానికి పార్టీ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు 5000/రూ నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు , టి పి సి సి కార్యదర్శి పిన్నంటి రఘునాథ్ రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య ,మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఏర్రం విద్యాసాగర్ ,సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ , కౌన్సిలర్స్ పొలం సత్యం యువ నాయకులు బింగి శివకిరణ్,ఎర్రబెల్లి రాజేష్, కట్లా రమేష్, నాయకులు , ఒడ్నాల శ్రీనివాస్,మహంకాళి శ్రీనివాస్,బత్తుల వేణు,అర్నే సతీష్,పోగుల లచ్చయ్య, అలుక పున్నం,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.