మేనిఫెస్టో తో కాంగ్రెస్ నాయకులకు నిద్రలు ఉండవు

-కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పెన్షన్ ఎంత..?

-అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

-అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది

#నెక్కొండ ,నేతి ధాత్రి: మండలంలోని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అలంకాని పేట నుండి చిన్నకోర్పోల్ వరకు 4. 67 కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణం కోసం మూడు కోట్లతో మరియు చిన్న కోర్పుల్ నుండి పెద్ద కొర్పోల్ వట్టేవాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని 13 90 లక్షల రూపాయలతో మరియు వట్టె వాగు పై చెక్ డ్యాం మరియు రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కోసం 18 60. 40 లక్షల రూపాయలతో పాటు వట్టేవాగుపై చెక్ డాం నిర్మాణం కోసం 324.90 లక్షలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదగా జరిపించారు. అనంతరం నెక్కొండ వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటుచేసిన ప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నెక్కొండ మండలంలోని పెద్దకొర్పుల్ వద్ద 20 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని నెక్కొండ మండలాన్ని ఎన్నడూ లేని విధంగా ఒకే టర్మ్ లో అభివృద్ధి చేశామని కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా సేవలు చేశామని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నర్సంపేటలో సొంత ఖర్చులతో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశామని రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయుటనికి 15వేల టన్నుల రైతు గోదాములను నిర్మించామని 2014 వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న రైతులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నష్టపరిహారం ఇచ్చిందో ప్రతి ఒక్క రైతు చెప్తున్నారని నేడు స్పెషల్ జీవో గా నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వడగండ్ల వారకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని రైతులకు వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీపై 75 కోట్లతో పనిముట్లను అందిస్తున్న ప్రభుత్వం కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజా ధారణ చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర కూడా పట్టడం లేదని రానున్న ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తో గెలిపించి రైతుల ప్రభుత్వంగా చాటి చెప్పాలని అన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు నచ్చిన ముఖ్యమంత్రిలు ఇద్దరే ఇద్దరని ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు కెసిఆర్ అని ప్రజల వద్దకు పాలనను ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారని అన్నారు అంతేగాక కాంగ్రెస్ పార్టీ పాలనలో నర్సంపేట నియోజకవర్గం కొట్లాటకు కేంద్రంగా ఉండేదని కానీ ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భారతదేశంలోని తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాలలో పెన్షన్లు ఎంత ఇస్తున్నారో మన అందరికీ తెలుసని మన రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ చూసి కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కారుస్తుందని అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణను నిర్మించుకున్నామని మరికొద్ది రోజుల్లో కెసిఆర్ ప్రవేశపెట్టే ఎన్నికల మేనిఫెస్టో తో కాంగ్రెస్ నాయకులకు నిద్రలేని రాత్రులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ జాతు రమేష్ నాయక్, జడ్పిటిసి సరోజా హరికిషన్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్, నెక్కొండ పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ మారం రాము, రెడ్లవాడ సొసైటీ చైర్మన్ జలగం సంపత్రావు, నియోజవర్గ బిఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, మండల నాయకులు తాటిపల్లి శివకుమార్, రవీందర్ రెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, మాదాసు రవి, బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!