మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో బుధవారం రోజున ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో మంజూరైన సిసి రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామం లో రోడ్లు సరిగా లేవని ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడంతో సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే గారు సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని ఎన్నో రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన ప్రజలు సమస్యను చెప్పగానే స్పందించి సీసీ రోడ్డులను మంజూరు చేసిన ఎమ్మెల్యే గారిని అభినందించారు. అలాగే మిగతా సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.