మండలంలో కాంగ్రెస్ నాయకుల ఇసుక అక్రమ దందా

మాలహర్ రావు, నేటిధాత్రి :
తాడిచెర్ల మానేరులో దొంగలు పడ్డారు అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల ఇసుక దందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఇసుక దందా ప్రారంభించిన కొందరు తాడిచెర్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల శివారు మానేరు నుండి గత రెండు నెలలుగా అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ఇసుక దందాలో ఒక వ్యక్తి విలేఖరి ముసుగులో ఇంకో ఇద్దరు వ్యక్తులు యూత్ కాంగ్రెస్ ముసుగులో ప్రత్యేక్షంగా ఇసుక దందా నడిపిస్తుంటే వీళ్లకు పరోక్షంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒకరు మండల ప్రజాప్రతినిధి, ఇంకొకరు గ్రామ మాజీ ప్రజాప్రతినిధి కాగా వీళ్లకు మండల అధికారులు కూడా తొడవడం కొసమెరుపు వీళ్లంతా కలిసి రోజు రాత్రి అక్రమ ఇసుక లారీలు రోజు సుమారు 25 చొప్పున తాడిచెర్ల ఊర్లో నుండి మల్లారం కొయ్యుర్ కాటారం మీదుగా హైద్రాబాద్ కు తరలిస్తూ లక్షల రూపాయలు ఘడిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇసుక అక్రమ రవాణా జరిగితే ఇసుక లారీలు అధికార పార్టీి మాజీఎమ్మెల్యే పుట్టమధుకర్ కు సంబంధం ఉందని అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ నియోజకవర్గం ప్రజలకు ఏం సమాధానం చెపుతారు.? అని బీఆర్ఎస్ పార్టీ మలహార్ రావు మండలం తరుపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు


కుంభం రాఘవ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్
చెప్యాల రామారావు, మాజీ జడ్పిటిసి సభ్యులు
గోనె శ్రీనివాస్ రావు, ఎంపీటీసీ సభ్యులు రావుల కల్పన మొగిలి, సీనియర్ నాయకులు కోట రవి, ఎండి తాజుద్దీన్,
గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నమనేని మధుసూదన్ రావు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!