రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి:-
మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో దివంగత ప్రధానమంత్రి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ 33 వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా ఉంచారని అన్నారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కింది గ్రామాల్లో అభివృద్ధి చెందాలని రాజీవ్ యువజన కింద ప్రతి గ్రామానికి నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.