
వీణవంక, ( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది
ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ……
భారతదేశానికి ఇంటర్నెట్ మొబైల్ రంగాలను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు నేడు మన మధ్యలో లేకపోవడం వారి ఆశయాలను వారి కుమారుడైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తోని ప్రజల మనస్సు గెలుచుకున్నాడు రాబోయే రోజుల లో దేశ ప్రధాన మంత్రి గా రాహుల్ గాంధీ నీ చూస్తామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు గంగాడి తిరుపతిరెడ్డి , ఎక్కటి రఘుపాల్ రెడ్డి, చిన్నాల ఐలయ్య పంజాల సతీష్ గౌడ్, నాయకులు నల్ల కొండల్ రెడ్డి, అడిగోప్పల సంపత్, నాగిది రామ్ రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, పత్తి సమ్మిరెడ్డి, పాకాల రాం రెడ్డి,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.