Congress Leaders Pay Tribute to Ramulu
పార్థివ దేహానికి పూలమాల అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):
చెనిగల రాములు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్ ఈ రోజు వర్ధన్నపేటమండలం లో, కట్రియా ల గ్రామానికి చెందిన చెనిగల కుమారస్వామి,చెనిగల రాజు గార్ల తండ్రి చెనిగల రాములు వృద్ధాప్యం పై బడి తేదీ 20-11-2025 రాత్రి 9-00 గంటల సమయంలో మరణించినందున నేడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,గుజ్జ రవీందర్ రెడ్డి, కట్రీ యాల టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య గారులు రాములు గారి నివాసం వద్ద,రాములు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి కుమారస్వామి,రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి ససంతాపం తెలుపడం జరిగింది.
