చందుర్తి, నేటిదాత్రి:
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అనధి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కి నియోజకవర్గ సమస్యలను వినిపించి 10 కోట్ల ఎస్టిఎఫ్ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కి మండల ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు….
10 కోట్ల నిధులనుండి కోటి 50 లక్షలు మండలానికి కేటాయించడంతోపాటు ఎన్ఆర్ఈజీఎస్ కింద సిసి రోడ్ల నిర్మాణానికి కోటి 50 లక్షలు కేటాయించడం హర్షనీయమని అన్నారు…
మండలానికి కేటాయించిన నిధులను వివిధ కుల సంఘాల నిర్మాణానికి, పాఠశాలలో మౌలిక వసతులకు, తాగునీటి సమస్యల పరిష్కారానికి వాడాలని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు….