Free Eye Surgery Bus Launched
ఉచితకంటిఆపరేషన్ బస్సును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ముత్తారంలో ఈనెల 3,4. తేదీల్లో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి పరీక్ష అనంతరం కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు వారికి కేటాయించిన తేదీల ప్రకారం హైదరాబాదు పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఆపరేషన్ అవసరమైన వారిని తీసుకెళ్తున్న బస్సును ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్ సింగల్ విండో మాజీ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు మరియు వార్డు సభ్యులు . చందు, దేవేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
