వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు
జైపూర్,నేటి ధాత్రి:
కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి వడ్ల సెంటర్లను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తెలుసుకొని సన్న రకం వడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందని కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరూ దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల సత్యనారాయణ రెడ్డి,మంతెన లక్ష్మణ్,చల్ల విశ్వంభర్ రెడ్డి,పండుగ రాజన్న,శీలం వెంకటేష్,లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.