మిట్టపల్లి లో క్రికెట్ ఆటస్థలం అభివృద్ధి కొరకు పదివేల ఆర్థిక సహాయం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో క్రికెట్ ఆటస్థలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యువత క్రీడలపై ఆసక్తిని పొంది మంచి మార్గంలో వెళ్లాలని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి నడవడికతో క్రీడారంగంలో ఆసక్తిని కనబరుస్తూ తోటి వారికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడ అనేది ఒక వ్యాయామ ప్రక్రియ అని అన్నారు.యువత క్రీడా రంగాలపై ఆసక్తి చూపుతూ గ్రామ యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి సర్పంచ్ కామెర మనోహర్, ఉపసర్పంచ్,గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
