బీఆర్ఎస్వీ నేతలపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్
హన్మకొండ, నేటిధాత్రి:
సీఎం ను కించపరుస్తూ కార్యక్రమాలు చేయడం పై మండిపడ్డ నిరుద్యోగ జేఏసి నాయకులు
నిరుద్యోగ జేఏసి రాష్ట్ర చైర్మన్ కోటూరి మానవతారాయ్ రాష్ట్రవ్యాప్త నిరసనల పిలుపు మేరకు…
కాకతీయ యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ శునకానందం పొందిన ఓయూ బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసి పిలుపు మేరకు కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసి బృందం కేయూ పీఎస్ లో ఎస్.ఐ అనంతరి మధు కి కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసి కన్వీనర్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపెల్లి నరేష్ లు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర సి.ఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఓయూ లోని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కుక్క బొమ్మకు అతికించి ర్యాబిస్ ఇంజక్షన్ ఇస్తూ, పిచ్చి కుక్క అని నినాదాలు చేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతీశారని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అన్నారు, గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న సీఎం పై ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడటం పై నిరుద్యోగ జెఏసి నేతలు మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జెఏసి నాయకులు గుండేటి సుమన్, ముత్యాల సాయి, శ్రీనివాస్, అరుణ్ కుమార్, సాయి వికాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.