
మండలంలో కాంగ్రెస్ జోరు..బీఆర్ఎస్ బేజారు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మండలంలోని వివిధ గ్రామాలలో నాయకులు నిర్వహిస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంటే..బీఆర్ఎస్ చతికిలపడిపోయింది. మండలంలోని పెద్ద కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సాంబయ్య నేతృత్వంలో గురువారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో ప్రజా పాలన మొదలైందని, ప్రజల స్థితిగతులు మారుతున్నాయని, 6 గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయని, ఈ గ్యారెంటీ పథకాలతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు.