
`ఒంటరిగా పోటీ కాంగ్రెస్‌కు ఎప్పటికైనా లాభం!
`సాగిలపడినంత కాలం ఇదే ఫలితం.
`సీట్లు కాంగ్రెస్ అడుక్కోవడం దురదృష్టకరం.
`ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మొదటకే మోసం.
`‘‘ఆప్’’ చేతిలో ఇప్పటికే మోసపోయింది.
`‘‘మహారాష్ట్ర’’లో పరువు పోగొట్డుకున్నది.
`ఉత్తరప్రదేశ్’’ లో ‘‘ఎస్పీ’’ ఇచ్చిన సీట్లు తీసుకున్నది.
`‘‘హర్యానా’’లో ‘‘ఆప్’’ మూలంగా ఆగమైపోయింది.
`‘‘డిల్లీ’’లో దిక్కు లేకుండా పోయింది.
`ఇప్పుడు ‘‘బీహార్’’ లో ‘‘ఆర్జేడీ’’ కూడా ‘‘కాంగ్రెస్’’ ను బెదిరిస్తోంది.
`ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ భయపడుతోంది.
`ఉత్తరాధిలో బలపడకపోతే భవిష్యత్తు ఆగమ్యగోచరం.
`ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పదేళ్లయినా కోలుకోవడం కష్టం.
`‘‘130 ఏళ్ల చరిత్ర’’ పార్టీకి వుంటే సరిపోదు.
`అవకాశాలు అందివచ్చినప్పుడు అందుకోకపోతే వెనుకబాటు తప్పదు.
`ప్రత్యర్థి బలంగా వున్నప్పుడు జనం ఏది చెప్పినా వినరు.
`మూస వాదాలను నుంచి కాంగ్రెస్ బైటకు రాకపోతే జనం గెలిపించరు.
`నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు.
`నమ్మించగల శక్తి వున్ననాయకులనే నమ్ముతున్నారు.
`ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు.
`దేశ వ్యాప్తంగా బలహీనపడిపోయారు.
`జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు.
`ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకుంటోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరుగుతోంది. రాహుల్ చెప్పే మాటలను జనం బాగా నమ్ముతున్నారు. ఆయన కోసం జనం సభలకు, ర్యాలీలకు విపరీతంగా వస్తున్నా రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీలను ఎందుకు నమ్ముకుంటోంది? ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఎందుకు ఆదారపడుతోంది? ఏ వామపక్షాలనైనతే కాంగ్రెస్‌బలంగా నమ్మిందో
ఆ వామపక్షాలు కాంగ్రెస్‌ను నిండా ముంచాయి? యూపిఏ వన్‌లో వామపక్షాలకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యత కల్పించింది. అయినా వామపక్షాలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. రెండోసారి యూపిఏలో వామపక్షాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను మోసం చేస్తూ వచ్చాయి. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్ అండతో గెలిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ను ఒక రకంగా అల్లాడిరచాయి. దేశంలో కాంగ్రెస్ ఈ పరిస్దితి రావడానికి కారణం వామపక్షాలు. ప్రాంతీయ పార్టీలు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతారన్నట్లు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన వాపక్షాలు కూడా కనుమరుగై పోయాయి. ఒకప్పుడు దేశంలో కీలకపాత్ర పోషిచిన వామపక్షాలు కాంగ్రెస్ మీద కత్తి దూసి ఆఖరుకు అడ్రస్ లేకుండాపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజేపి ఇంతలా పుంజుకోవడానికి వామ పక్షాలే పరోక్ష కారణం. కాంగ్రెస్ పార్టీ ఉదారతను అలుసుగా తీసుకొని ఆపార్టీని నిర్వీర్యం చేస్తే తాము బలపడతామని వామపక్షాలు భావించాయి. కాని కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేస్తే బిజేపి బలం పెరుగుతుందని ఆలోచించలేకపోయాయి. ఆ తర్వాత దేశంలోనే వామపక్షాలకు ఉనికి లేకుండా పోతాయని కూడా ఊహించలేదు. కాంగ్రెస్ అధికారం లోవున్నంత కాలం ప్రభుత్వం మీద నిరసనలు, ధర్నాలు, బంధులు చేపట్టేవి. మరి ఇప్పుడు పదకొండేళ్లుగా నోరు విప్పడానికి కూడా వామపక్షాలు ధైర్యం చేయలేకపో
తున్నాయి. కూర్చున్న చెట్టు కొమ్మ నరు క్కున్న వామపక్షాల పుణ్యమా? అని కాంగ్రెస్ గడ్డు రోజలు తెచ్చుకున్నది. ఇప్పటికైనా కాంగ్రె స్పార్టీ తేరుకోవాల్సిన అవసరం వుంది. 130 సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకోవడం కాదు? అప్పటి రాజకీయాలను చూపించే శక్తి తెచ్చుకోవాలి. రాజులైనా, రాజ్యాలైనా పట్టాభిషేకమే కీలకం. రాజకీ యాలైనా, నాయకులైనా పదవులే ముఖ్యం. ఈ విషయం రాహుల్‌గాందీ పదే పదే మర్చిపో తున్నాడు. ఘజనీ లాగా ఎన్నిసార్లు దండయాత్ర చేశాడన్నది ఆదర్శం ఎప్పుడూ కాదు. విఫల ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా ఉపయోగం లేదు. అవకాశాలను అందిపుచ్చులేని వారు నాయకులుగా పనికిరారు. ప్రజాసేవ అనేది పదవుల్లో వున్నప్పుడే ఎక్కువ చేయగలరు. విసృతమైన సేవ చేయగలరు. నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ 2009లోనే తప్పటడుగు వేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాంధీ ప్రదాని కావాలనుకున్నారు. కాలేకపో యారు. 2009లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. రాహుల్ గాందీ చేజేతులా దానిని జార విడుచుకున్నారు. ఆనాడు ప్రధానిగా పనిచేసి ఐదేళ్లు పాలన చేసి, తర్వాత ఓడిపోయినా మాజీ ప్రదాని అనే గౌరవం వుండేది. కష్టపడకుండానే అన్నీ అవకాశాలు అందినప్పుడు జార విచుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు. మంత్రి పదవి వద్దన్న రాహుల్ గాంధీ ఈ పదకొండు సంవత్సరాలలో ఏం సాధించారు. రాజకీయాలు ఏం అవగాహన చేసుకున్నారు. తాను ప్రధాని అయితే ప్రజలకు ఏంచేయలగలను అనేది కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం అనవసర వృధా ప్రయత్నాలు చేస్తున్నా రు. చరిత్రో పోరాటం చేసి గెలిచిన వారున్నారు. అందివచ్చిన అవకాశాలతో పదవులు అందుకున్నవారున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించిన వారు కూడా వున్నారు. రాజకీయాల్లో వ్యూహాలకన్నా మిన్నవైనవి ఏమీ వుండవు. వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేసినంత కాలం పగ్గాలు ఆయన చేతిలో పెట్టలేదు. పగ్గాలు రాహుల్ గాందీ అందుకోలేదు. రాహుల్ గాందీ స్ధానంలో మరే నాయకుడు వున్నా, కాంగ్రెస్‌ను అదికారంలోకి తీసుకొచ్చేవారు. పార్టీ అధ్యక్షుడి పదవే మోయలేని రాహుల్ గాంధీ దేశ బాద్యతను ఎలా నిర్వర్తిస్తారో అర్దం కావడం లేదు. ఎందుకంటే ఆయన నాయకత్వమంతా ఫెయిల్యూర్‌తోనే మొదలౌతోంది. ఫెయిల్యూర్ కాంగ్రెస్ మూట గట్టుకుంటోంది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ గెలిచింది వుందా? కాంగ్రెస్‌ను రాహుల్ గెలిపించాడన్న భావన పార్టీలో వుందా? ఆయన వ్యూహాలన్నీ అపజయాలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకా నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా వుంటాయో తెలియవు. ఈసారి కూడా రాహుల్ గాంధీ తన పంథాను మార్చుకోలే కపోతే దేశంలో కాంగ్రెస్ ప్రజలకు మరింత దూరమవడం ఖాయం. దేశంలో ప్రజలు బిజేపిని గెలిపిస్తున్నారంటే, మరో ప్రజలకుమరో ప్రత్యా మ్నాయం కనిపించడం లేదు. రాహుల్ గాందీ మీద ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికీ రాహుల్ విషయంలో చిన్న పిల్లల చేష్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మానుకోవాలి. హుందాగా రాజకీయాలు చేయడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు దూరంగా వుండాలి. ఎన్నికల తర్వాత పొత్తులకు పోవాలే తప్ప, ఎన్నికలుముందు పొత్తులే కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తున్నాయి. ఒక్కసారి గత ఐదారేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే, ప్రాంతీయ పార్టీలను నమ్మి బొక్కా బోర్లా పడుతూ వస్తోంది. తన కాళ్ల మీద తాను కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ఇచ్చే సీట్ల మీద ఆదారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్ దురదృష్టకరం. 80 లోకసభ సీట్లులో 15 సీట్లు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఏం కావాలి. వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి. పార్టీలు చీలితే బిజేపి బాగు పడుతుందన్న భ్రమ నుంచి కాంగ్రెస్ బైటకు రావాలి. కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకోవాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫ్రధాన కారణం ఆప్. అదే ఆప్‌తో సక్యత వల్ల కాంగ్రెస్‌కు మరింత నష్టమే మిగిలింది తప్ప లాభం జరగలేదు. నిజానికి 2013లో ఆప్‌కు డిల్లీలో మద్దతు ఉపసహంరించుకోవడం కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు. తర్వాత ఆప్ కోసం చేతులు చాప డం కాంగ్రెస్ చేసిన రెండో తప్పు. అక్కడితో ఆగకుండా పదేపదే ఆప్ కోసం తన రాజకీయాన్ని కాంగ్రెస్ కోల్పోతూ వచ్చింది. హర్యానాలో గెలవాల్సిన కాంగ్రెస్‌ఎందుకు ఓడిపోయింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగానే అదికార బిజేపి విజయాలు సొంతం చేసు కుంటోంది. ప్రతిపక్షాల మధ్య లుక లుకలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టు కొస్తున్నాయి. డిల్లీ మాజీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు కు పంపించినప్పుడు ఆయనకు మద్ద తుగా కాంగ్రెస్ నిలిచింది. తర్వాత హర్యానా ఎన్నికలకు ముందు ఆప్‌తో కలిసి బిజేపికి వ్యతిరేకంగా ప్రచా రం సాగించింది. ఆఖరుకు ఎన్ని కలు దగ్గర పడి టికెట్ల పంపకాలలో తేడా వచ్చింది. ఆప్ జెల్లకొట్టి కాంగ్రెస్‌కు హాండ్ ఇచ్చింది. దాంతో మళ్లీ హర్యానాలో మూడోసారి బిజేపి గెలిచింది. హాట్రిక్ సాధిం చింది. అదే సమయంలో కాంగ్రెస్, ఆప్‌లు సర్ధుకుపోతే అధికారం దక్కేది. కాని కలిసి సాగలేదు. అది డిల్లీలో కూడా బిజేపి అదికా రంలోకి రావడానికి కారణ మైంది. ప్రతి చోట కాంగ్రెస్ మీద ఇతర ప్రాంతీ య పార్టీలు ఆదిపత్యం వహించా లనే చూస్తున్నాయి. తాజాగా బిహార్ లో నిన్నటి వరకు మహాగట్‌బం దన్లో భాగంగా ఆర్జేడీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రచారం చేస్తూ వచ్చిం ది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ దృష్టిపెట్టింది. ఎలాగైనా సరే బిజేపిని, జేడీయూకు అధికారానికి చరమగీతం పాడాలని రాహు ల్ గాందీ ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. అందులో భాగం గా ఓట్ చోరీ అనే విషయాన్ని పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. బీహార్ సాక్షిగా ఎన్నికల సంఘం మీద పెద్దఎ త్తున ఆరోపణలు చేశారు. 65లక్షల ఓట్ల గల్లంతుపై న్యాయం పోరాటం చేస్తున్నా రు. ప్రజల్లో వుంటూ చైతన్యా న్ని రగిలిస్తున్నారు. తీరా ఎన్ని కల తేదీ ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు. ఇలా ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని పదేళ్లుగా రాజకీయం చేసినా ఎదు గూ బొదులేదు. ఇలా తమ శ్రమను ప్రాంతీయపార్టీలకు వృదా చేయడం కన్నా, పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంతైనా అవసరం. బిజేపిని ఓడిరచాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను పెంచి పోషిస్తున్నారు. అయినా కాంగ్రెస్ మీద ఆ పార్టీలకు కృతజ్ఞత వుండడం లేదు. అందుకే ఇక నుంచైనా ఒంటరి పోరు మీద దృష్టిపెట్టండి. అదే పార్టీని గట్టెక్కిస్తుంది.