
Dalit Bandhu
కాంగ్రెస్ మాయమాటలతో దళితులను మోసం చేస్తుంది
దళితబందు రెండోవిడత విడుదల చేయాలి
దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్
పరకాల నేటిధాత్రి
పథకాల పేరుతో దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని రెండో విడత దళితబందు విడుదల చేయాలని దళిత బందు సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఏకు కార్తీక్ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో దళతుల బలమేందో చూపిస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులను మోసం చేస్తూ వాళ్ళ ఓట్లను దండుకోవడానికి రెండో విడత దళిత బంధు నిధులిస్తాం,ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయల అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని చెప్పి దళిత బంధు నిధులు ఇవ్వకుండా కనీసం అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రారంభించకుండా దళితులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుందని గత 18 నెలలుగా ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఇదిగో అదిగో అని మాయమాటలు చెబుతూ దళితులను వంచిస్తుందని ఏకు కార్తీక్ తెలిపారు.ఇలాంటి ప్రభుత్వానికి ఇక ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నిర్ణయించుకుందని దానిలో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా రెండవ దశ దళిత బంధుసాధన ఉద్యమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచుతామని తెలిపారు.దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి దళిత బంధు మరియు అంబేద్కర్ ఆభయం హస్తం ఇచ్చేదాకా దళిత బంధు సాధన సమితి లబ్ధిదారుల తరుపున పోరాటం చేస్తుందని అన్నారు.