Congress Distributes Indira Mahila Shakti Sarees in Zaheerabad
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.
◆:- -జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కార్
◆:- సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి
◆:- మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నవంబర్ 23: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కార్,సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి పేర్కొన్నారు.జహీరాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్ నియోజకవర్గ గ్రామాల స్వయం సహాయక సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శేట్కార్,యన్.గిరిధర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాబోయే రోజుల్లో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.అంతే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను త్వరలోనే అమలుపరిచేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్వీర్,సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ ఆయా మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, హన్మంతరావు పాటిల్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షద్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
