
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు.శనివారం
మర్రిగూడ మండలంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు జరిగిన ప్రజల వద్దకు పాలన సంక్షేమ కార్యక్రమంలో ప్రజల వద్ద తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయాలని పేదలకు 6 గ్యారంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం పూర్తి చేయాలని ఆయన అన్నారు అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి భూమిలేని నిరుపేదలను గుర్తించి పోరంబోకు బంజారాయి ప్రభుత్వ భూములను భూస్వాముల ఆధీనం నుండి తీసి భూమిలేని పేదలకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ భూములు సాగు చేసుకున్న అటువంటి పేదలను గుర్తించి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అట్లాగే చర్లగూడెం ముంపు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి పనులు పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య ఉప్పునూతల వెంకటయ్య మై ల సత్తయ్య గిరి వెంకటయ్య నీలకంఠ యాదయ్య ఎడ్ల అంజయ్య మాడుగుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు