
BJP Slams Congress on BC Reservations
ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం
గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.