
Congress government
బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బీజేపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా.
సవతి తల్లి తన సవతి పిల్లలపైన సవతి ప్రేమా ఎలా చూపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అడ్డగోలుగా, ఇష్టానుసారంగా తలా తోక లేని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు, అలాగే కామారెడ్డిలో డిక్లేర్ చేసిన బీసీ రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందని తెలుసుకోకుండా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు బిజెపి పైన ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ నీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ తెలిసి చేశారా తెలియక చేశారా అన్న అంశం కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి. జనవరి 1, 1979 నాడు అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ ని బీ.పీ మండల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 340 ప్రకారం ఎవరైతే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కమిషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కమిటీ వాళ్లు సర్వే చేసి డిసెంబర్ 31, 1984 సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1979లో ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ లో ఉండెనో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ 1989 వరకు అధికారంలో ఉండడం జరిగింది కానీ ఈ పదేళ్ల కాలంలో రాజీవ్ గాంధీ గారు గాని సోనియా గాంధీ గారు గాని ఈ రిపోర్టు పైన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 1990లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 1990లో అప్పటి ప్రధానమంత్రి అయిన వీ.పీ సింగ్ గారు ఈ మండల్ కమిటీ వారు ఏదైతే రిపోర్టు ఇవ్వడం జరిగిందో ఆ రిపోర్టు ప్రకారము 27% రిజర్వేషన్ ఇవ్వాలని వారు నిర్ణయించుకొని రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ని అమల్లోకి తీసుకురావడం వల్ల దేశంలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ఇంద్రా సావ్నే అనే పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల, సుప్రీంకోర్టు ఇంద్రా సావ్నే vs యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో, 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో మూడు గవర్నమెంటల్ మిషనరీస్ ని అమలులోకి తీసుకురావడం జరిగింది (లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ). అయితే పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేయడం జరుగుతుందో ఆ బిల్లు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ లిమిట్ ని విధించడం జరిగింది. ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ బిసి రిజర్వేషన్ ని ఆమోదించిన కూడా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది.
ఒకవేళ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా స్పష్టమైన మరియు న్యాయపరమైన అలాగే స్టాటిస్టికల్ డేటాని చూపిస్తూ మన రాష్ట్రంలో బీసీలు ఎలా అణిచివేయబడుతున్నారు, వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతున్నది అని ఇలాంటి అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి ఇచ్చినప్పుడు మాత్రమే బిసి రిజర్వేషన్నీ ఆమోదించడం జరుగుతుంది.మీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాస్ట్ సర్వే చేశామని చెప్పడం జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టడం లేదని జ్యోతి పండాల్ కాంగ్రెస్ లీడర్స్ ని ప్రశ్నించడం జరిగింది. ఆ రిపోర్టు బయట పెట్టినప్పుడు మాత్రమే మీరు ఎంత బాగా సర్వే చేశారని తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ సర్వే కరెక్ట్ గా జరగలేదు బీసీల జనాభాని తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ వారు తీన్మార్ మల్లన్న నీ సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే బీసీ సర్వే అవ్వకముందే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎలా ప్రవేశపెడతారు? ఈ అడ్డిమారి గుడ్డి బిసి సర్వే ని ఆధారం చేసుకొని బిజెపి ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టు గాని ఎలా ఆమోదిస్తుంది అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు.
బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు తగిన బుద్ధి చెబుతారనే భయంతో బీసీల పైన సవతి ప్రేమ చూపిస్తూ ఢిల్లీలో నిరసన తెలియజేయడం చూస్తుంటే, బట్ట కాల్చి బిజెపి పైన వేయాలన్న ఉద్దేశం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల వరకు భారతదేశంలో రూలింగ్ లో ఉండే మరి అప్పుడు బీసీల పైన ఈ ప్రేమ ఎక్కడ పోయింది, కొత్తగా ఈ ప్రేమ ఇప్పుడు ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో తెలియజేయాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
మీ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇది సుప్రీంకోర్టు ఆమోదించదు మరియు 9th షెడ్యూల్లో కూడా చేర్చడం చాలా కష్టమైన విషయం అని తెలిసి కూడా బీసీల సింపతి కోసం మరియు బీసీల ఓట్ల కోసం ఈ సవతి ప్రేమ చూపించడం జరిగిందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఉన్న బీసీలు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాగే మద్దతు తెలిపితే మిమ్మల్ని ఇలానే మోసం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేలా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కావున కాంగ్రెస్ లో ఉన్న బీసీలు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాన్ని తెలుసుకోవాలని మరియు తెలుసుకుంటారని ఆశిస్తున్నానని జ్యోతి పండాల్ అన్నారు.