
-అసలైన గేమ్ స్టార్ట్ చేసిన సీఎం. ‘‘రేవంత్ రెడ్డి’’.
-కాంగ్రెస్ మ్యానిఫెస్టో అమలుకు పడుతున్న అడుగులు.
-పదకొండేళ్ల తర్వాత ఇండ్లకు మోక్షం.
-పదేళ్లు బిఆర్ఎస్ లో ఎదురుచూసిన జనం.
-అదిగో ఇదిగో అని ఆఖరుకు మాట తప్పిన గత ప్రభుత్వం.
-పల్లెల్లో పట్టు బిగించేందుకు వడివడిగా పరుగులు.
-సన్న బియ్యంతో అన్నం.
-ఇందిరమ్మ ఇంటిలో నివాసం.
-పేదలకు కాంగ్రెస్ పాలనే వరం
-పేదల సమస్యలు తీర్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం.
-మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇండ్లు.
-మూడేళ్ళలలో తెలంగాణ పేదలకు అందనున్న ఇరువైలక్షల ఇందిరమ్మ ఇండ్లు.
-ఇళ్లు లేని పేదలకు గూడు నిర్మాణమే సంకల్పం.
-అందరికీ ఆవాసమే సిఎం. రేవంత్ రెడ్డి లక్ష్యం.
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపకంతో ఒక్కసారిగా పల్లెల్లో పండగ వాతావరణం నెలకొన్నది. నియోజకవర్గానికి సుమారు 3500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ప్రజల సొంతిళ్లుకోసం గత 11 సంవత్సరాలుగా తెలంగాణలోఎదరుచూస్తున్నారు. ఇంత కాలం తర్వాత సొంతింటి కల నెరవేరుతుందన్న ఆనందం ఆ కుటుంబాలలో వెల్లివిరిస్తోంది. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మఇండ్లు ఇస్తామని వాగ్ధానం చేసింది. ప్రజలు కూడా బలంగా నమ్మారు. అయితే అదికారంలోకి వచ్చిన తొలి ఏడాదినుంచే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. కాని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. రెండు సార్లు అదికారంలోకి వచ్చిన కేసిఆర్ చెప్పిన మాటల నమ్మి, ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. కాని మూడోసారి వచ్చినా కేసిఆర్ డబుల్ బెడ్రూంలు ఇవ్వరని ప్రజలు తేల్చుకున్నారు. తమకు ఇండ్లు కావాలన్నా, రావాలన్న కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే తమ కల నెరవేరుతుందని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం నిజమౌతోంది. తెలంగాణలో తొలివిడత దాదాపు రాష్ట్ర వాప్తంగా ఐదు లక్షల ఇండ్ల నిర్మానం చేపడుతున్నట్లు తెలుస్తోంది. పల్లెలు,పట్టణ ప్రాంతాలన్నీ కలుపుకొని తొలి విడత పట్టాల పంపణీ కార్యక్రమం మొదలైంది. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింది కూడా అనేక గ్రామాల్లో ఇప్పటీకే చాలా చోట్ల ఇండ్లపట్టాల మంజూరు జరగింది. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా విడుదలయ్యాయి. ఇండ్ల పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి. దాదాపు పూర్తి దశకు చాలా వరకు చేరుకున్నాయి. కొన్ని పూర్తయి గృహప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మాసం ఆషాడం కావడం వల్ల శ్రావణ మాసం తొలి వారంలోనే నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పెద్దఎత్తున గృహప్రవేశాలు ఏకకాలంలో చేయాలని కూడా అదికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా కూడా చేయాలని సిఎం. రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఈనెల రోజుల కాలంలో కూడా పూర్తి స్ధాయిలో ఇండ్ల నిర్మాణాలు కూడా మొదలుకానున్నాయి. అది ఎంత ఆలస్యమైనా దసరా పండుగ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరిగేందుకు శరవేగంగా నిర్మాణాలు జరనున్నాయి. ఒక్క సంవత్సరంలో సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటే ఒక రికార్డుగా చెప్పొచ్చు. గతంలో ఉమ్మడిరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరిగింది. తర్వాత పదేళ్లు ఇండ్ల నిర్మాణం జరగలేదు. ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు ఏటా ఐదు లక్షల ఇండ్లు నిర్మాణం చేసి, వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ద పెట్టారు. అందుకు ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు నిర్వహించారు. క్షేత్ర స్దాయి పరిశీలనలు కూడా చెపట్టారు. ఏది ఆలసమ్యమైనా సరే ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యం కాకుండా చూసేందుకు మంత్రి పొంగులేటి ఎంతో శ్రమించారు. దాని ఫలితమే ఇందిరమ్మ ఇండ్లకు ఇంత త్వరగా మోక్షం లభించిందని అంటున్నారు. పదకొండేళ్ల తర్వాత తమకు ఇండ్లు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పే నాయకుడు కాదని ప్రజలు కొనియాడుతున్నారు. అందుకే కేసిఆర్‌ను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని పల్లెల్లో ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ అంటేనే ఇండ్లు..ఇండ్లు అంటేనే కాంగ్రెస్ అని గతంలోనే అనేక సార్లు నిరూపించడం జరిగింది. నిజానికి ఇలా పేదలకు ఇండ్ల నిర్మాణం అనేది ఇందిరాగాందీ కాలంలో మొదలైంది. ఆమె దేశ వ్యాప్తంగా దళితులకు పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మాణం చేయించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ముఖ్యంగా 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుంది. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ సమయంలో తొలివిడతలోనే కొన్ని లక్షల ఇండ్లు మంజూరు చేశారు. మొత్తంగా 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 45 నుంచి 50లక్షల వరకు ఇండ్లు నిర్మాణం చేశారు. అందులో తెలంగాణకు సుమారు 25లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో చాల మందికి ఇండ్లు వచ్చాయి. అయితే 2014లో తెలంగాణ వచ్చింది. అప్పటికి ఇంకా కొంత మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ ఎన్నికల సమయంలో అగ్గిపెట్టె లాంటి ఇందిరమ్మ ఇండ్లు కాకుండా పెద్దఎత్తున డబుల్ బెడ్ రూంలు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ మాటలు ప్రజలు సహజంగానే విశ్వసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా రెండు మూడేండ్లయినా ప్రజలు డబుల్ బెడ్ రూంల గురించి అడగలేదు. అలా అడకుండా కేసిఆర్ ప్రజలకు మాయ మాటలుచెప్పి కాలయాపనచేశాడు. 2018 ఎన్నికలు వచ్చాయి. 60ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలలో పోతుందా? అని చెప్పి, మరో సారి అవకాశమిస్తే ఈసారి పేదవాళ్లందరికీ ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చాడు. మళ్లీ తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ను నమ్మారు. రెండోసారి కూడాకేసిఆర్ మాట తప్పాడు. ఒక దశలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులెత్తేశాడు. 2023 ఎన్నికల్లో కేసిఆర్ గెలిస్తే ఇక డబుల్ బెడ్ రూంల ఇండ్లేమో గాని, ఇందిరమ్మ ఇండ్లు కూడా రాకుండాపోతాయని ప్రజలు ఆలోచించారు. ఇందిరమ్మ ఇండ్లురావాలంటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనికోరుకున్నారు. గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కూడా నిలుపుకునేందుకు రెండో ఏడాది నుంచే కృషి మొదలు పెట్టింది. ఈ బడ్జెట్లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించింది. తొలి త్రైమాసికం తర్వాత నిధుల విడుదల మొదలు పెట్టింది. ఇటు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కార్యక్రమం రూపకల్పన జరిగిపోయింది. ఏక కాలంలో జరిగిన రెండు కార్యక్రమాల వల్ల అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యరూపం దాల్చుతోంది. అదిగో ఇదిగో అంటూ పదేళ్ల పాటు సాదగీసిన కేసిఆర్ లాగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వెండాలని వెంటనే ఇందిరమ్మ ఇండ్లకు మోక్షం కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసలైన అభివృద్ది మొదలు పెట్టి గేమ్స్ స్టార్ట్స్ నౌ అంటున్నట్లే వుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక రెండు తరాలకు ఉపయోగపడే కార్యక్రమం. పైగా గతంలో పల్లెలో వుండే ఇండ్లు ఒక్క తరానికి మాత్రమే ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రతి నిర్మానం కాంట్రీట్తోనే కావడం వల్ల ఆ ఇండ్లు సుమారు రెండు తరాలకుకూడా ఉపయోగపతాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండు తరాలు గుర్తు చేసుకుంటారు. ఎవరి హాయంలో ఇల్లు వచ్చిందన్న ప్రస్తావన వచ్చిన ప్రతీసారి రేవంత్‌రెడ్డి పేరు గుర్తు చేసుకుంటారు. ఇదే గతంలో వైఎస్ అనుసరించారు. అందుకే ఇప్పటీకీ ఆయనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఇదే విధంగా సిఎం. రేవంత్ రెడ్డిని గుర్తుంచుకుంటారని చెప్పడంలో సందేహంలేదు. పైగా తెలంగాణలో సన్న బియ్యం అందించిన నాయకుడిగా కూడా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రేషన్ బియ్యం పంపిణీ జరిగినంత కాలం తెలంగాణలో ప్రజలు రేవంత్ రెడ్డిని పదే పదే గుర్తు చేసుకుంటారు. సన్న బియ్యం తింటూ, ఇందిరమ్మ ఇంట్లో వుంటూ రేవంత్ రెడ్డిని నిత్యం తల్చుకుంటారు. దేవుడిగా కొలుచుకుంటారు.