అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

ధర్మారం సొసైటీకి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు.
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్
జమ్మికుంట, నేటిధాత్రి
సన్నవడ్లు పండించిన ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనిధర్మారం,రామన్నపల్లిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో ధాన్యం కొనుగోలు గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల విషయంలో చిత్తశుద్ధిగా ఉందని రైతు పండించిన పంట చివరిగింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దనిభరోసానిచ్చారు.ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులతో,మిలర్లతో మాట్లాడామని ధాన్యం దింపుకునే సమయంలో మిల్లర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చామనిఅన్నారు.ధర్మారంలో గల సొసైటీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!