పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బిజెపి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఆరోపణలకు వాడుకున్నకాంగ్రెస్, బీఆర్ఎస్
చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించని భూపాలపల్లి ఎమ్మెల్యే
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని
తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ అన్నారు.
శుక్రవారం గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బుధవారం నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి సమయం సరిపోతుందన్నారు.
రాష్ట్రంలో తాగు సాగు నీరందక రైతాంగం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీశారని ఆమె అన్నారు.
రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యమైందని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కీర్తి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తిరిగి కాంగ్రెస్ బిఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం జరిగిందే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని అన్నారు.
చట్టసభల సమయం వృధా అవ్వడం తప్ప ప్రజా సమస్యలపై చర్చించిన పాపాన పోలేదన్నారు.
అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంలో విఫలమయ్యారని మొక్కుబడిగా కొన్ని విషయాలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించారని కీర్తి రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
ముఖ్యంగా మండలంలోని గాంధీ నగర్ లో ఇండస్ట్రియల్ కార్యులర్ కోసం శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిశిదర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వినర్ ప్రసాద్ రావు, గణపురం మండల శాఖ అధ్యక్షులు ఊర నవీన్ రావు,రేగొండ మండల మాజీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వినర్ దుగ్యల రామ్ చందర్ రావు, నాయకులు మంద మహేష్, ప్రవీణ్, రాజు, విప్లవ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.