
BRS Leader Distributes Congress Pending Cards
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రేగొండ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ఈ మాయ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డాదో తెలియచేస్తూ రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి బాకీ కార్డు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించాలని కోరుతూ రేగొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన బీఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు