
Pendli Ravi passed away
మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా నాయకులు.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం తిరుమలాపూర్* గ్రామానికి చెందిన పెండ్లి రవి ఇటీవల మరణించగా నేడు వారి నివాసాలకు వెళ్లి పెండ్లి రవి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేశారు.అదే గ్రామానికి చెందిన కంచు చంద్రమ్మ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం* అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి రవి, యూత్ అధ్యక్షుడు రాంబాబు, చిట్యాల టౌన్ యూత్ అధ్యక్షులు అల్లం రాజు, కొత్తపల్లి రాము గోపగాని శివకృష్ణ, గోల్కొండ మహేష్, ఎలగొండ చిరంజీవి, గోపగాని వెంకటేశ్వర్లు, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, కంచు తిరుపతి, గొర్రెటి ఓదెలు, గద్దల తిరుపతి, జన్నె జనార్ధన్, కలవేన ప్రవీణ్, నగరపు సాయి తదితరులు పాల్గొన్నారు.