Congress Accused of Misleading Women with Saree Scheme
ఇందిరా మహిళా శక్తి చీరల పేరుతో కాంగ్రెస్ మోసం
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండల్ సోషల్ మీడియా ఇంచార్జ్ బాపు నాయక్ అన్నారు.గత పదేళ్లుగా కేసీఆర్ బతుకమ్మ చీరలు మహిళలకు అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా మహిళలకు చీరలు ఇవ్వకుండా ఇప్పుడు కేవలం ఎన్నికల నేపథ్యంలో ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేస్తూ మహిళల ఓట్ల లబ్ధి కొరకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని మరిచిందని,చీరలతో పాటు రెండేళ్లుగా రావలసిన 2500 రూపాయలతో పాటు చేయూత పెన్షన్ బకాయిలు, ఆసరా పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలన్నారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని అన్నారు.
