# వరిదాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ నేడు మాటమార్చిన కాంగ్రేస్
# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
వరిధాన్యానికి మద్దతు దరకంటే రూ. 500 బోనస్ ఇచ్చి తీసుకుంటామని, మిగతా పంటలకు కూడా బోనస్ లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ఇచ్చిన మాట తప్పి రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.దరలు పడిపోయినప్పుడు మాత్రం బోనస్ ఇస్తాం అంటూ మీడియా సాక్షిగా మాట్లాడిన కాంగ్రేస్ దరణి మెంబర్ కాంగ్రేస్ నాయకుడు కోదండ రెడ్డి నేడు మాట మార్చుతూ వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ కాంగ్రేస్ రైతు వ్యతిరేఖ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇది రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
మద్దతు దర పడిపోతే ప్రభుత్వాలే రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వాలే మద్దతు దరకు కొనుగోలు చేయాలని చట్టమే ఉన్నదని , గత కేసీఆర్ ప్రభుత్వం ఆ పద్దతిలోనే కొనుగోలు చేసిందని అందులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కలిపి ఇచ్చేదేముంది..? అని ప్రశ్నించారు.కాంగ్రేస్ మ్యానిఫేస్టోలోని 8వ పేజీలో స్పష్టంగా మద్దతు దరతో పాటు, ఏఏ పంటకు ఎంత బోనస్ చెల్లిస్తారో స్పష్టంగా ఉందని అది చూసే రైతులు నీకు ఓట్లు వేసారని పేర్కొన్నారు. రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి అదికారంలోకి వచ్చాక అసంపూర్ణంగా పాతపద్దతిలోనే వేస్తున్నారని ఇప్పటికి రైతులు రైతుబంధుకోసం ఎదురుచూస్తుండగా
ఈ ప్రకటనతో మరో హామీని కాంగ్రేస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో మద్దతుదరతో ప్రభుత్వమే రైతు కల్లాల వద్ద దాన్యం కొనుగోలు చేసిందని కాగా రైతన్నలకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. కాంగ్రేస్ స్టార్ క్యాంపేయినర్లు,రాహుల్ గాంది, ప్రియాంకగాంది,రేవంత్ రెడ్డి లో తమ మ్యానిఫేస్టోలో, ప్రచారంలో బోనస్ హామీ గుప్పించి నేడు మాటమార్చడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు.
మోసపూరిత కాంగ్రేస్ పార్టీకి రైతులు బుద్ది చెప్పాలని అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై అసత్యాలతోనే కాంగ్రేస్ కాలం వెల్లదీస్తూ హామీలు అమలు చేయకుండా ప్రజలను,రైతులను మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.