అబద్దాపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

-అభివృద్ధి పనులను వివరించడంలో కొన్ని చోట్ల విఫలమయ్యాం..
-ప్రతి గ్రామంలో ప్రశాంత్ అన్న అభివృద్ధి కనబడుతుంది..
-వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేద్దాం
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

బాల్కొండ :
రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో కొన్ని చోట్ల విఫలమయ్యాం..అబద్దాపు ప్రచారాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు..బుధవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం లక్కోరా ఎఎన్ జి ఫంక్షన్ హాల్ లో జరిగిన బిఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై పలు సూచనలు చేశారు..

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్ :

-బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం తరుపున శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నా..

-తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ ఎంతో కృషి చేశారు.. కొన్ని చోట్ల మాత్రమే చిన్న పొరపాట్ల వల్లే ఓడిపోయాం..

-ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా..నిత్యం అసత్యాలు ప్రచారం చేసినా..కెసిఆర్ గారిని అభివృద్ధిని వివరించడం లో ప్రతి ఇంటికి తీసుకపోయే వారు మీరే.

– ప్రతి గ్రామంలో అభివృద్ధిని వివరించి ప్రశాంత్ అన్న గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు కృతజ్ఞతలు..

– ప్రశాంత్ రెడ్డి అభివృద్ధిని చూసినా నియోజకవర్గం ప్రజలు సోషల్ మీడియాలో వచ్చిన అసత్యపు ప్రచారా లను నమ్మురు అని చెప్పిన కెసిఆర్ గారి మాటలు నిజం చేసారని ఈ సందర్బంగా గుర్తు చేశారు..

-వారు చేసిన అభివృద్ధి పనులకు నియోజకవర్గంలో 50వేల మెజారిటీ కన్నా తక్కువ రాకూడదు..కానీ ప్రజలు మాయ మాటల, మోసపు మాటలకూ లోనవ్వడం జరిగింది..

-రాబోయే ఎన్నికల్లో ఎంపీ, జడ్పీటీసీ, తదితర ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధికి వాళ్ళ చేసే అబద్దాల ప్రచారంకు పోటీ ఉంటుంది తప్పా వేరే ఉండదు.

-ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ, టిడిపి, బిఆర్ఎస్ పార్టీ రాజకీయం చూసాం..గ్రామాల్లో లబ్ధిపొందిన వారిలో పేద ప్రజలు ఉన్నారు..తప్పా కానీ మన నాయకులు ఎవరూ లేరు..

-నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఇకనుండి పథకాలు ఏమి వచ్చినా కాంగ్రెస్ వాళ్ళం మేమే తీసుకుంటామని ఎగిరి ఎగిరి పడుతున్నారు. ఇందులో 5మందితో కమిటీ వేస్తారటని తెలుస్తుంది..ఆలా చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు..

-తెలంగాణ కార్యకర్తలు అందరం అర్హులందరికీ అందేలా నిలిదీసి అడుగుతారు..

-రాష్ట్రంలో 70లక్షలు మందికి 11విడుతాల్లో రైతు బంధు వేసాము..ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఒక్క కార్యకర్త లంచం కూడా తీసుకోలేదు..డైరెక్ట్ వారి ఖాతాల్లో జమ చేసాం..

-రైతు భరోసా డిసెంబర్ 9 కి రూ.15వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా..?

-దేశంలో రైతుభీమా ఎక్కడ ఇవ్వలేదు..రైతు ప్రమాదవశత్తు చనిపోతే లక్ష25వేల రైతులకు దేశంలో ఎక్కడ లెని విధంగా రూ.5లక్షలు ఇచ్చాం..కార్యకర్త ఒక్కరూ కూడా ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు..

-అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అబద్దాపు ప్రచారం చేశారు..2014 తరువాత పూర్తిగా ఆత్మహత్యలు తగ్గినా ప్రాంతం కేవలం తెలంగాణ ప్రాంతం..అది కెసిఆర్ గారి నాయకత్వమే తప్పా మరొకటి కాదు..

-దేశంలో ఎక్కడ లెనివిధంగా ఒక్క కెసిఆర్ 24గంటల కరెంటు ఇచ్చారు..ఇప్పుడు 24గంటల కరెంటు వస్తున్నాదా..కేవలం 5గంటల కరెంటు వస్తుంది..కరెంటు ఇవ్వమంటే అప్పులు అయ్యాయి..2014లో రాష్ట్రంలో అప్పులు ఉన్నాయ్ అని చెప్పలేదు..ఏమి చేయలేక అప్పులు అని మాట్లాడుతున్నారు..

-2014ముందు నియోజకవర్గం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందని ప్రజాలందరూ గమనించాలి..

-2014లో 24లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే ఆనాడు ప్రభుత్వం పండించి తీసుకుంది..కానీ గత సం లక్ష41వేల మెట్రిక్ టన్నుల ఒడ్లను మొత్తం మనమే తీసుకున్నామని గుర్తు చేశారు.. దారిదాపుగా 3కోట్ల మెట్రిక్ టన్నులు పండించి వడ్లు కొనుగోలు చేసాం..ఎట్లా సాద్యమైందన్నారు..సమయానికి విత్తనలు ఎరువులు ఇచ్చం..పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసాం..
భారత దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం
నిలిచింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!