అయినవోలు మండలంలో కాంగ్రెస్ జాతీయ నేతల ప్రచారం
నేతృత్వం వహించిన
ఏఐసీసీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ ఉల్లెంగల యాదగిరి
మండల వ్యాప్తంగా ప్రచారానికి కొత్త ఊపు
నేటిధాత్రి అయినవోలు:
అయినవోలు మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ మరియు మధ్యప్రదేశ్ ఇన్చార్జి ఉల్లెంగల యాదగిరి స్వయంగా హాజరై ప్రచారానికి విశేషమైన దృష్టిని ఆకర్షించారు. గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతి చోట ఆయనకు ప్రజల నుంచి అపారమైన స్పందన లభించింది.ప్రచార బృందంతో కలిసి ఇంటింటా తిరిగిన ఉల్లెంగల యాదగిరి, అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను ఓటు వేయాలని కోరారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌నే ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం నెలకొన్నట్లు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించబోతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుర్ర రాజు నాయక్, మాజీ కార్పొరేటర్ హన్మకొండ రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రొఫెసర్ బూర ముత్తిలింగం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
