`కాంగ్రెస్, బీజేపీ లు దేశంలో బద్ద శత్రువులు!
`దశబ్దాలుగా రాజకీయాలలో భిన్న ధ్రువాలు?
`తెలంగాణా లో మాత్రం బహిర్గత శత్రువులు.. అంతర్గత మిత్రులు?
`తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ విచిత్రమైన అనుబంధం?
`రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక్కరు స్పందించరు?
`నిత్యం బీఆరఎస్ ను నిందిస్తూనే వుంటారు?
`గత ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తి పోస్తూనే వుంటారు?
`ఇంత వరకు ఆరు గ్యారెంటీల మీద అడిగిన బీజేపీ నాయకుడు లేడు?
`రెండేళ్ల కాంగ్రెస్ పాలన మీద మాట్లాడిన వాళ్ళు లేరు?
`తెలంగాణాలో వచ్చేది మేమే అంటారు… నాయకుల్లో సఖ్యత లేదు?
`సర్పంచ్ ఎన్నికలలో కొన్ని గెలిచిందే ఎక్కువ అనుకుంటున్నారు?
`రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశ్నించరు?
`కేంద్రం నుంచి నిధుల వరద తేలేరు?
`ఒకప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యేగా వున్న ప్రభాకర్ పాటి పని కూడా ఎంపిలు చేయడం లేదు?
`ఇప్పుడు ఎనమిది మంది ఎమ్మెల్యే లు, ఎనమిది మంది ఎంపీలున్నారు?
`ప్రభాకర్ లాగా నిధులు తెచ్చిన వారు ఒక్కరు లేరు?
`ఇదినా ఘనత అని చెప్పుకునేందుకు ఏమిలేదు?
`ప్రసిడెంట్ గా అర్హత మాత్రం మాదే అని అందరూ అంటారు?
`పార్టీ ని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకునే వారు లేరు?
`రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లెతు మాట అనలేరు?
`మున్సిపాలిటీ ఎన్నికల ముందు కూడా సమాలోచనలు లేవు?
హైదరాబాద్, నేటిధాత్రి:
పేరు పెద్ద ఊరు దిబ్బ అంటే ఇదే! ఆ పార్టీలో అందరూ ఉద్దండులే. రాజకీయ అనుభవంలో అందరూ కింగ్లే. పార్టీ బరువు మోయాలని అందరూ చూస్తున్నవారే. కాని పార్టీ బలోపేతానికి అందరూ చేతులేత్తేసేవారే? ఈ మాట అంటున్నది ఎవరో కాదు? సాక్ష్యాత్తు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణలో బిజేపి బలోపేతం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీ వైపు నిలిచేందుకు ప్రజలు కూడా ఎంతో కొంత అనుకూలంగానే వున్నారు. అందుకే గత ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నడూ లేని విదంగా ఎనమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎనమిది మంది ఎంపిలను గెలిపించారు. దాంతో ఇక తెలంగాణలో బిజేపికి మంచి రోజులు వచ్చినట్లే అని అందరూ అనుకున్నారు. పార్టీ ఇక గాడిలో పడినట్లే అని సంతోషపడ్డారు. ఎనమిది మందిఎంపిలు గెలిచినందుకు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాని ఏమైంది? ఏమౌతోంది? పార్టీ ఎటు పోతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? గెలిచిన వారు ఏ రాజకీయాలు చేస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా రానన్ని సీట్లు ఇప్ప్పుడు బిజేపి వచ్చాయి. బిజేపిఅంటే ప్రజల్లో గతం కన్నా సానుకూలమైన వాతావరణం ఏర్పడినట్లే అనుకున్నారు. కార్యకర్తలు అనుకున్నదొక్కటి..జరుగుతున్నదొక్కటి!! కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర బిజేపి నాయకులు ఎందుకు కదలడం లేదు? పై నుంచి వున్న ఆదేశాలా? లేక రాష్ట్ర నాయకుల ఆలోచనలా? అన్నది కూడా తేలాల్సి వుంది. సొంత పార్టీ కార్యకర్తలే గందరగోళంలో వున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా విశ్వసిస్తారు? ఎలా ఓట్లేసి గెలిపించుకుంటారు? ప్రజలకు బిజేపి పార్టీ కావాలనుకుంటే గెలిపించుకుంటారు? అని అనుకుంటున్నారా? రెండేళ్ల కాలంలో చేస్తున్న రాజకీయం ఏమిటి? బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలేమిటి? అనేది ఎవరూ చెప్పలేరు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఈగ వాలకుండా రక్షణగా వుంటున్నారన్న రాజకీయ విమర్శలకు కూడా సమాధానం చెప్పేవారు లేరు. తెలంగాణలో బిజేపి బలహీన పడడడం వల్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. అదికారంలోకి వచ్చింది. ఎప్ప్పుడైతే బండి సంజయ్‌ని పక్కన పెట్టారో అప్ప్పుడే పార్టీ మీద ప్రజల్లో కూడా అసహనం ఏర్పడింది. కార్యకర్తలో నిస్తేజం ఆవహించింది. అయినా సరే ప్రజలు కోరుకున్న ప్రాంతాల్లోఎమ్మెల్యేలు గెలిచారు. ఎంపిలు కూడా గెలిచారు. ఇంకా ప్రజలు ఎలాంటి సంకేతాలివ్వాలని అనుకుంటున్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీ అనేది పాలకపక్షం మీద యుద్దం చేయాలి. కాని తెలంగాణలో రివర్స్ రాజకీయం సాగుతోంది. ఇంకా బిఆరఎస్ పార్టీయే అదికారంలో వున్నట్లు బిజేపి నాయకులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. రైతులకు సక్రమంగా రైతు భరోసా ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్ధానాలు ఏవీ అమలు చేయడం లేదు. ఒక్క ఆర్టీసిలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పర్ఫెక్టుగా అమలు జరుగుతోంది. సిలిండర్ రూ.500 అమలు జరుగుతుందనంటున్నారు. అది ఎంత మందికి వస్తుందనేది ఎవరికీ అర్దం కావడం లేదు. ఇక రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా కొంత వరకు బాగానే అమలు జరుగుతోంది. ఇక మిగతా పథకాల అమలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో అందుతాయా? లేదా? అన్నది ఎవరికీ అర్దంకాకుండా వుంది. ఇందిరమ్మ ఇ ండ్లు కొంత సాగుతున్నాయి. ఇక మిగతా వాగ్దానాలు అమలుకు నోచుకోవడం లేదు. రైతు భరోసా రూ.15000 ఇస్తామన్నారు. ఆఖరుకు రూ.12000 ఇస్తామన్నారు. కాని రెండేళ్లలో కేవలం రెండు విడతలు మాత్రమే అందాయి. మిగతా రెండు విడతలు అందలేదు. మూడో ఏడాది తొలి విడతకు మోక్షం రావడం లేదు. వాటిని గురించి బిజేపి ఎందుకు ప్రస్తావించడం లేదో అర్ధం కావడంలేదు. అదే సందర్భంలో మోడీ కిసాన్ పధకం సక్రమంగా సకాలంలో అమలు జరుగుతోంది. ఇక్కడ ఎందుకు జరగడం లేదన్నది ఎందుకు ప్రశ్నించడం లేదు. వయసు మళ్లిన వారికి గత ప్రభుత్వం నుంచి అందుతున్న పిం చన్ల పెంపు ముచ్చటే లేదు. అదికారంలోకి వచ్చిన వెంటనే వద్దులకు అందుతున్న పించన్లు వెంటనే పెంచుతామన్నారు. నెల నెల రూ.4000 ఇస్తామన్నారు. దాని అమలు కూడా నోచుకోలేదు. కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. తులం జాడ లేదు. ఇచ్చే పరిస్దితి కనిపించడంలేదు. తెలంగాణలో వున్న ప్రతి మహిళకు రూ.2500 నెల నెల ఇస్తామన్నారు. అది కూడా పరీశీలనలోనే లేదు. 18 సంవత్సరాలు నిండిన చదువుకునే ప్రతి అమ్మాయికి ఉచితంగా స్కూటీ ఇస్తామన్నారు. అదీ గతి లేదు. విద్యార్దులకు రూ.5 లక్షల కార్డు ఇస్తామన్నారు. అదీ ముందట పడింది లేదు. ఇన్ని వైపల్యాలు కంటి మందుకు కనిపిస్తున్నా బిజేపి నాయకులు చూడడం లేదు. ప్రభుత్వాన్ని అడగడం లేదు. నిలదీయడంలేదు. ఉద్యమాలు చేయడం లేదు. పోరాటాల ముచ్చట అసలే లేదు. కాని గత పాలన మీదనే ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని దగ్గరుండి బిజేపి నాయకులు రక్షిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తాజాగా నైనీ బొగ్గు గనుల కేటాయింపులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రచ్చ రచ్చ జరగుతోంది. బిజేపి నాయకులు కనిపించడం లేదు. వినిపించడం లేదు. అసలు ఆ సంగతే వారు పట్టించుకోవడం లేదు. కేంద్రం స్పందించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్‌రావు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఉలుకు పలుకులేదు. బిజేపి నాయకుల స్పందనే లేదు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందన విచిత్రంగా వుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నైనీ బ్లాక్ విషయంలో ఉత్తరం రాస్తే తాము రంగంలోకి దిగుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి వింత సమాదానం వస్తుందని ఎవరూ ఊహించలేదు. సాక్ష్యాత్తు పిసిసి. ప్రెసిడెంటు సవాలు చేసినా కేంద్ర మంత్రి ఉలుకు లేదు..పలుకు లేదు? సరే రాజకీయాలపై కాకుండా అభివద్ది మీద ఏదైనా దష్టిపెడుతున్నారా? అంటే అదీ లేదు. 2014 ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఎన్విఎసఎస్ ప్రభాకర్ లాంటి నాయకులు బిజేపి లేరా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగా వున్న సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. రూ.1750 కోట్ల రూపాయల విలువైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును సాదించారు. అందుకోసం ఆయన అనేక సార్లు డిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరిని పలుసార్లు కలిశారు. మొత్తానికి ఎలివేటెడ్ కారిడార్‌ను సాధించారు. దాని కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇ ంతా కాదు. అదే రకంగా తన నియోజకవర్గ పరిధిలో వున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివద్ది కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అలా చేసిన ప్రయత్నంలో ఏకంగా చర్లపల్లిని స్టేషన్‌ను టెర్మినల్‌గా చేసేలా కషి చేశారు. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగించాలని అనేక విజ్ఞప్తులు చేశారు. మూడో లైన్ కావాలని కోరారు. ఇలా ఆయన పట్టుపట్టి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అలాంటి నాయకుడిని జనం ఓడించారు. పార్టీ కూడా ఆయన సేవలను పట్టించుకోవడం మానేసింది. ఇప్ప్పుడు ఎనమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివద్ది కోసం డిల్లీ గడప తొక్కిందిలేదు. కేంద్ర మంత్రులను కలిసింది లేరు. అర్జీలు ఇచ్చింది లేదు. ప్రాజెక్టులు సాదించింది లేదు. అలాగే ఎనమిది మంది ఎంపిలున్నారు. కాని వాళ్లు కూడా తాము ఫలాన ప్రాజెక్టును తెచ్చామని చెప్ప్పుకోవడానికి ఏదీ లేదు. తెలంగాణ అంటేనే నీటి సమస్య. ఒకప్పటి పరిస్దితి ఇప్ప్పుడు లేదు. కాని ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులున్నాయి. వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వారు లేరు. వారికి ఆ సోయి కూడా లేదు. పార్టీలో లుకలుకలు తప్ప మరేం కనిపించడం లేదు. బిఆరఎస్ నుంచి ప్రభుత్వం మీదకు విమర్శలు వచ్చినప్ప్పుడు మాత్రం బిజేపి నాయకులు వెంటనే స్పందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈగ వాలకుండా చేస్తుంటారు. దేశంలో కొన్ని దశాబ్ధాలుగా బద్దశత్రువైన కాంగ్రెస్‌తో తెలంగాణలో ఈ అంతర్గత రహస్య స్నేహమేమిటో ఎవరికీ అర్ధం కాదు!!
