
జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే – 8(నేటి ధాత్రి):
సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల రాధిక జైస్వాల్ జిల్లాకు బదిలీపై వచ్చిన సందర్భంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది.. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న వేధింపులు లైంగిక వేధింపుల బాధితులకు పునరావాసం ఆర్థిక సదుపాయాలు వయోవృద్ధుల ఆశ్రమంలో ఆవాసితుల సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులకు లీగల్ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు…అలాగే సఖి బాధితులకి డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ డిఐఆర్ ఫైలింగ్ మరియు కౌన్సిలింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు… జిల్లాలో మంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. మంచి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి ఫలాలను సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు వరుసలో ఉన్నారని మరింత ప్రగతి పథంలో తీసుకెళ్లాలని సూచించారు..