
CPI Rajanna Siricilla District Secretary Venu
సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వేణు
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సిపిఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు పాల్గొన్నారు.