నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న పాలాయి శ్రీనివాస్ ను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి పూల బోకే అందించి శాలువా లతో సత్కరించి అభినందించారు
ఛైర్మెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛందసంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్,ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు,బెజ్జంకి ప్రభాకర్, ఛాయా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కోట డేవిడ్,జిల్లా వినియోగదారుల మండలి సభ్యుడు నాగెల్లి
సారంగం,నర్సంపేట మెడికల్ షాప్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తంగెళ్ళ రవికాంత్,,స్వచ్ఛంద సంస్థల సభ్యులు చారి,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.