డ్రైన్ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

హన్మకొండ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్ లో లోటస్ అపార్ట్మెంట్ ఎదురుగా కోటి 50 లక్షల నిధులతో ఏర్పాటు చేస్తున్న డ్రైన్ అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగ పర్యటించినప్పు ఇక్కడ డ్రైన్ లేక వరదల సమయంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నామని మోర వినపించాగా శాసన సభ్యునిగా ఎన్నిక కాగానే డ్రైన్ ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది, అందులో భాగంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నెరవేర్చడం జరిగింది గత ప్రభుత్వంలో పాలకులు కేవలం హామీలకే పరిమితమయ్యారు. కాని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏవయితే హామీలు ప్రజలకు ఇచ్చారో అవి నెరవేర్చడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పక చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు గజపాక రమేష్, యూత్ కాంగ్రెస్ నేషనల్ డెలిగేట్ సాగరిక రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, మల్జి కార్పోరేటర్ ఏ. నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు తాళ్ళపల్లి సుధాకర్, అనుకోటి పున్నం, మల్లా రెడ్డి, కట్ట రఘుపాల్ రెడ్డి, మండల సమ్మయ్య, మొహమ్మద్ గౌస్పాషా అభినవ్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!