రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర, వెలిచాల గ్రామాలలో చోప్పదండి సిఐ ప్రకాష్ గౌడ్, రామడుగు ఎస్సై సురేందర్ కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న పలువాహనాలను తనికి చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులున్నా సమాచారం అందజేస్తే చర్యలు తీసుకోకపోవడం జరుగుతుందని తెలిపారు.