విద్యుత్ ఉద్యోగులకు భద్రత, అవగాహనా కార్యక్రమం నిర్వహణ
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన గుండి సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ ఉద్యోగులకు విద్యుత్ భద్రత అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి విశేష అతిథిగా కరీంనగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మేక రమేష్ బాబు, ముఖ్యఅతిథిగా కరీంనగర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ ఎం.తిరుపతిలు హాజరై విద్యుత్ భద్రత సూత్రాలు, భద్రతపై ప్రతిజ్ఞ, పరికరాల ఉపయోగంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాలకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులు, మండలాల యొక్క ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.