మృతుడి కుటుంబానికి పరామర్శ.
#అంతిమయాత్రలో పాల్గొన్న బానోతు సారంగపాణి.
నల్లబెల్లి నేటి ధాత్రి:
మండలంలోని దస్తగిరి పల్లె గ్రామ మాజీ ఉపసర్పంచ్ హైమద్ తండ్రి మైనుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్దివ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మాజీ ఫ్యాక్స్ చైర్మన్ మురళీధర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, సర్పంచులు పులి రమేష్ గౌడ్, మచ్చిక రవి గౌడ్, మాజీ సర్పంచులు గోనే రాంబాబు, ఊరటి అమరేందర్, పెండ్యాల సుధాకర్, నాయకులు సురేష్, గుంపుల రాజు, శ్రీను, మహేందర్, ప్రశాంత్, నవీన్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
