MLA Manik Rao Pays Tribute to Harish Rao’s Father
మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి మరణంపై సంతాపం.
◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కోనేటి మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణంపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సంతాపం ప్రకటించారు హైదరాబాద్లోని వారి నివాసానికి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించరు వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,
ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు తంజిం మాజి ఆలయ చైర్మన్ వెంకటేశం సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.
