పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల ఫాసిస్టు హంతక దాడిని ఖండించండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
బుధవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హర్యానా,పంజాబ్ సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్టు అంతక స్వభావంతో అత్యంత కర్కశంగా జరిపిన కాల్పులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 24 సంవత్సరాల యువరైతు శుభకరంసింగ్ మరణించారు. ఈ అంతక దాడిని ఖండిస్తూ గుండాల మండల కేంద్రంలో (బాటన్న స్థూపం) సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చెశారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు, కాంగ్రెస్ నాయకులు ఎస్కే ఖదీర్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ రైతులు పండించిన పంటకు(ఎంఎస్పి) గిట్టుబాటు ధర కల్పించాలని దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరిన రైతులను ఢిల్లీ వెళ్లకుండా వివిధ రాష్ట్రాల సరిహద్దులలో చెక్ పోస్టులుపెట్టి అడ్డుకోవడం సరేనా పద్దతి కాదని అన్నారు.
హర్యానా పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువరైతు శుభకరం సింగ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈ కాల్పులకు బాధ్యులైన పోలీసులను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఈసం కృష్ణన్న, పెండేకట్ల పెంటన్న,పర్శక రవి, మానాల ఉపేందర్, సిపిఐ నాయకులు ఎస్కే షాహిద్, ప్రజాపంద నాయకులు కోడూరు జగన్, దళిత సంఘం నాయకులు బొమ్మె ర్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!