
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆద్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
కారేపల్లి నేటి ధాత్రి
దేశ రైతాంగం కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని డిమాండ్ తో”చలో ఢిల్లీ” కార్యక్రమానికి వెళుతున్న రైతాంగంపై నిర్బంధ ఆంక్షలు 144 సెక్షన్ విధించి, టిఆర్ గ్యాస్ గ్యాస్ ,రబ్బర్ బుల్లెట్ల తో కాల్పులు చేయడానికి నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మాదారం గ్రామ కమిటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, డివిజన్ నాయకులు గుగులోతు తేజ మాట్లాడుతూ
కేంద్ర బిజెపి ప్రభుత్వం గతంలో కరోనా సమయంలో తీసుకువచ్చిన కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను ,విద్యుత్ సవరణ బిల్లుల వల్ల కార్పొరేట్లకు లాభం చేకూరి దేశ రైతాంగానికి గుదిబండగా మారుతుందని, రైతాంగం దివాలా తీస్తుందని, దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు ఒక వేదికను ఏర్పాటు చేసుకొని లక్షలాది మంది రైతులకుతో ఆందోళన చేసి, పై చట్టాలను రద్దుచేసి రైతాంగ పండించిన ఉత్పత్తులపై మద్దతు ధరలు ప్రకటించి గ్యారెంటీ చట్టం చేయాలని 14 నెలలు కరోనా కష్టకాలంలో ఎండ ,వాన, చలి లెక్కచేయకుండా జీరో డిగ్రీ చలిలో లక్షలాదిమంది ఆందోళన చేస్తే కేంద్ర బిజెపి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
ఆ సందర్భంగా కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు గ్యారంటీ చట్టం చేస్తామని, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, మరణించిన అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ హామీలను కాలగర్భంలో కలుపుతూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావడం ప్రయత్నం చేస్తుంది. మళ్లీ అవే చట్టాలను అమలు చేయడానికి పూనుకుంటుంది. దీన్ని గమనించిన దేశ రైతు సంఘాలు ఫిబ్రవరి 13న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంయుక్తా కిసాన్ మోర్చా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పంజాబ్ ,హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ ,రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు సంబంధించిన వేలాదిమంది రైతాంగం, వేలాది ట్రాక్టర్స్, ట్రక్కులు ద్వారా ఆరు నెలలకు సరిపడ బత్యాన్ని వెంట తీసుకుని వెళుతుంటే, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలని, రైతే రాజు అని చెబుతూ రైతు నడ్డి విరుస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దులలో విదేశీ విద్రోవశక్తులపై ఎలాగైతే పోరాటం చేస్తుందో ఆ రకంగా రహదారులను కాంక్రీట్ దిమ్మెలతో, ఇనుప చువ్వాలతో అడ్డగిస్తూ దేశం రక్షణకు ఉపయోగించే వందలాది కంపెనీ బలగాలను దించి రైతులపై లాఠీచార్జి, టీఆర్ఎస్, భాష్వా వాయువులని ప్రయోగిస్తూ ఢిల్లీని అష్టదిగ్బంధనం చేయడం దుర్మార్గమైన చర్య అని దీన్ని దేశ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. చర్చల సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేనియెడల దేశవ్యాప్తంగా ఢిల్లీ తరహా ఉద్యమాలు ఉధృతం అవుతాయని వీటిలో దేశ రైతాంగం ప్రజలు బాగా స్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదారం గ్రామ కార్యదర్శి రావుల నాగేశ్వరరావు, మండల నాయకులు సత్తిరెడ్డి, కోయల శ్రీను, వేములపల్లి వీరున్న, గ్రామ నాయకులు ఈసం సుక్కయ్య కోయల వెంకన్న రామదాసు నాయక్ ప్రభాకర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..