
N. Giridhar Reddy.
సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువ పత్రాలు అందజేసిన ఎంపీ
◆:- జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శేట్కార్ మరియు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం ధ్రువ పత్రాలు అందించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్‌కుమార్ శెట్కార్ మరియు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి. ఈ సందర్భంగా ఎంపి సురేష్ శేట్కార్, సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి గార్లు మాట్లాడుతూ సెట్విన్ లో శిక్షణ పొందిన అభ్యర్థులు స్వయం ఉపాధితో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. సెట్విన్‌లో శిక్షణ పొందే అభ్యర్థులకు ఉజ్వల్ పౌండేషన్ ఆధ్వర్యంలో 25% ఫీజు చెల్లిస్తామని చెప్పడం చాలా అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎం.డి. వేణుగోపాల్‌రావు, అర్డీవో రాంరెడ్డి, మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్ తన్విర్, సిడిసి చైర్మన్ ముబీన్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు, ఎంపిడిఓ మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,డిసిసి జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ రెడ్డి,మాజీ కౌన్సిలర్లు.రాజశేఖర్,తాహేరా బేగం,కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ వైస్ యం.పి.పిరాములు,మల్లారెడ్డి,సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,గుండా రెడ్డి,శుక్లవర్ధన్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి,అరుణ్,రాజు,నాగి శెట్టి,ఇమామ్ పటేల్,జుబేర్ పటేల్,జావీద్,గోపాల్, నర్సింహులు,బాణోత్ రాజు నాయక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శిహర్షవర్ధన్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు కిరణ్ గౌడ్, సునీల్,మల్లికార్జున్ మరియు సెట్విన్ శిక్షణ సిబ్బంది,అధికారులు,సెట్విన్ శిక్షణ పొందిన అభ్యర్థులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.