అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
చిరుధాన్యాలతోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఇమిడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఆరేపల్లి లో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారం, బాలల హక్కుల గురించి చర్చించారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి పాఠశాల హెడ్మాస్టర్ జ్యోతి, గర్భిణీ స్త్రీలు, తల్లులు, మహిళలు, బాలలు తదితరులు పాల్గొన్నారు.