
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
పౌష్టికాహారంతోనేసంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించి,ఇంటింటా వెలుగులు నింపాలని ప్రధానోపాధ్యాయులుభూతం ముత్యాలు,కొండాపురం పంచాయతీ సెక్రెటరీపాండు రంగంఅన్నారు.చండూరు మండల పరిధిలోనికొండాపురం గ్రామంలోపోషణ మాసోత్సవాలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని వాళ్లు రక్తహీనతకు గురికాకుండాసరైన పోషకాహారాలు,ఆకుకూరలు,పండ్లు పోషకాహారం తీసుకోవాలనివారు అన్నారు.అంగన్వాడి కేంద్రంలోప్రతిరోజు ఒక పూట భోజనం,అన్నం,పాలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందనివారు వివరించారు.అలాగే పుట్టిన బిడ్డకు తల్లి ఇచ్చే ముర్రుపాలుఅమృతంతో సమానమన్నారు.బాలింతలుపిల్లలనుఆరోగ్యవంతంగా పెంచుకునేందుకుకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలనుసద్వినియోగం చేసుకోవాలన్నారు.ఐరన్ లోపంఎక్కువగా ఉన్నప్పుడుతప్పనిసరిగా పోషకాహార పదార్థాలతో పాటు మందులు వేసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలుతీసుకోవలసినపోషకాహార పదార్థాలుఇంటి వద్ద దొరికేవి,తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించేవి వారు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఅంగన్వాడి టీచర్లుఅవ్వారి నాగమణి,బరిగెల రమణ, ఆయాలు అండాలు, సుగుణమ్మగర్భిణీ స్త్రీలు,బాలింతలువిద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.