-ఎంపీపీ ప్రకాష్ రావు,
-మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
-బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు-వెంకట నర్సయ్య
ఖానాపూర్ నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపాలని ఈసీ కి కాంగ్రెస్ పార్టీ నేతలు పిర్యాదు చెయ్యడం వారూ ఓటమి భయంతోనే పిరికిపంధా చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ .ఈ సందర్భంగా ఖానాపురం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆన్ గోయింగ్ పథకాలు రైతుబందు,రైతు బీమా,దళితబందు,గృహలక్ష్మీ పథకాలను మొదలగు వాటిని ఆపాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పిర్యాదు చేయడంపై వారి దుర్మార్గపు ఆలోచనను రైతులు అర్ధం చేసుకోవాలని కోరారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న వాటిపై కూడ వారు కక్ష సాధింపుతో పిర్యాదు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటమి భయంతో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్నా కరెంట్ కూడ అపాలని పిర్యాదు చేస్తారని హెద్దవ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న ఇంటిఇంటికి మంచినీటి సరఫరాను కూడ ఆపే కుటీల ప్రయత్నాలకు పాల్పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ నెలలో రైతులు పండించిన ధాన్యం చేతికి వస్తుందని,వాటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సకాలంలో జరుగుతాయని,వీటిని కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల పేరుతో ఆపే నీచపు రాజకీయాలకు తెరదించుతారా? అని ప్రజల్లో చర్చ జరుగుతోందని అన్నారు.తెలంగాణ ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై నీచపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతులు, మేధావులు,యువకులు ఓటుతో బుద్ది చెప్పాలని కోరారు.ఈ సమావేశంలో క్లస్టర్ బాద్యులు షేక్ మౌలానా,తక్కలపెళ్లి రమేష్,గుగులోతు బాలు నాయక్,షేక్ మస్తాన్,వల్లెపు శ్రీనివాస్,కోరె సుధాకర్,సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్, నాయకులు వెన్ను పూర్ణ చందర్,ఒర్సు రవి,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.