ఉమ్మడి జిల్లా పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షులు పవన్ కుమార్
వనపర్తి నేటిధాత్రి;
వనపర్తి జిల్లా వెనుకబడిన సంక్షేమ అవినీతి అధికారి సుబ్బారెడ్డి పై విచారణ చేసి సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పి డి ఎస్ యూ అధ్యక్షులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కొండనాగుల హాస్టల్ వార్డెన్ గా పని చేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయనపై ఏసీబీ కేసు కూడా ఉన్నదని జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులు పవన్ కుమార్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రత్యేక కమిటీ వేసి సుబ్బారెడ్డి పై ఉన్న కేసును విచారణ చేసి చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వారు పేర్కొన్నారు .వినతి పత్రం ఇచ్చిన వారిలో పి డి ఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ రాజశేఖర్ ప్రవీణ్ రాజు గణేష్ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు