
Government Land
“ప్రభుత్వ భూమిని కాపాడాలని.. కలెక్టర్ కు ఫిర్యాదు”
” అధికారులపై చర్యలు తీసుకోండి”
బాలానగర్ / నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామపంచాయతీ శివారు అయ్యప్ప స్వామి దేవాలయ ఆలయ సమీపంలోని సర్వేనెంబర్ 102, 105 ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ కి సంబంధించిన ఆర్చిని ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు వెంచర్ యజమానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సామాజిక సేవా కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

స్థానిక రెవిన్యూ అధికారులు వెంచర్ యాజమాన్యంతో కుమ్ముక్కై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న ఏం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వ భూమిని కాపాడకుండా వెంచర్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ భూమిలో ఆర్చి నిర్మాణానికి సహకరించిన అధికారులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ రేటు ఒక ఎకరం రూ.4 కోట్ల వరకు ఉంటుందని విలువైన భూమిని కాపాడడంలో విఫలమైన స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012వ సంవత్సరంలో హైదరాబాదులో నగరానికి 70 కిలోమీటర్ల విస్తీర్ణంలో జాతీయ రహదారులకు రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరికి అసైన్మెంట్ చేయరాదన్న జీవోను జారీ చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు విస్మరించి.. రికా వ్యాల్యూ వెంచర్ యజమానికి అనుకూలంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.