Complaint to Collector over ₹8.5 Crore CMR Rice Scam
సీ ఎం ఆర్ 8.50 కోట్ల బియ్యం దోపిడీపై కలెక్టర్ కు ఫిర్యాదు
పేదవాడు తప్పు చేస్తే జైల్లో వేస్తారు
ధనమున్నవాడు దోచుకుంటే మాత్రం ఊళ్లో ఉంచుతారా?
మంథని డివిజన్ దళిత నాయకుడు ఊట్ల శ్రీను
ముత్తారం :- నేటి ధాత్రి
పేద ప్రజల కొరకు ఉచిత రేషన్ బియ్యం అందించడం కొరకు ప్రభుత్వం ఐకెపి ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్ సి ఐ కి బియ్యం అందించాల్సిన రైస్ మిల్లర్ యజమాని సిఎంఆర్ ఎగవేత పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కు మంథని డివిజన్ దళిత సంఘం నాయకుడు ఊట్ల శ్రీను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను కలసి ఎఫ్ సి ఐ కి అప్పగించాల్సిన సిఎంఆర్ బియ్యం శ్రీ వెంకట సాయి ఇండస్ట్రీస్ చేసిన దోపిడి గురించి కలెక్టర్ కి వివరించారు ఈ సందర్భంగా ఊట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మంథని మండలంలోని కూచ్రాజుపల్లి గ్రామ శివారులోని శ్రీ వెంకటా సాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల యజమానులైన చెల్కల అశోక్ కుమార్, బోడ సంపత్ రెడ్డి, చెల్కల స్వర్ణలత, బోడ సరోజన లు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ 8 కోట్ల 50 లక్షల పైచిలుకు ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్టు తెలిపారు పేద ప్రజలకు చెందిన బియ్యాన్ని అడ్డగోలుగా దోచుకున్న వారిపై ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు పేద ప్రజల సొమ్మును ఎంత రికవరీ చేశారో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు పేదోడు తప్పు చేస్తే జైల్లో వేస్తారు కానీ ధనవంతుడు దోచుకుంటే మాత్రం అరెస్టు చేయరా అని అన్నారు కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఎంక్వైరీ చేస్తానని తెలిపినట్టు ఊట్ల శ్రీనివాస్ తెలిపారు
