పట్టాదారు నుండి కొనుగోలు చేశాము
కలెక్టర్ పై పిర్యాదు చేయడం కరెక్ట్ కాదు
ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి పైన చర్యలు తీసుకోండి
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ మండలం, చిన్న వడ్డేపల్లి చెరువు శిఖరం
302సర్వే నంబర్ లోని భూమి విషయమై జన్ను నూతన్ బాబు సోమవారం జిల్లా కలెక్టర్ పై పిర్యాదు చేశాను అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేయడం సమంజసం కాదని, ఆ స్థలం కొనుగోలు చేసిన వాళ్ళు, ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, వరంగల్ మండలం, చిన్న వడ్డేపల్లి చెరువు శిఖరం 302సర్వే నంబర్ లో ఒక ఎకరం తొమ్మిది గుంటల భూమి కలదు అట్టి భూమికి ధరణి పట్టదారు అయిన జన్ను కొమురయ్య కుమారులు, జన్ను కుమారస్వామి, వీరస్వామి దగ్గర నుండి 2007లో మాందాటి శ్రీనివాస్ జి.పి.ఏ కల్గి ఉన్నాడు అని, పట్టదారులు అయిన కుమారస్వామి, వీరాస్వామి మరియు జి.పి.ఏ హోల్డర్ శ్రీనివాస్ ల వద్ద నుండి వెల్ది సాంబయ్య, వెల్ది చంద్రమౌళి, వెల్ది తులసి, వెలిషాల అరుణ, లకుం భాస్కర్ లు కొనుగోలు చేసి, వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఎల్ ఆర్ ఎస్ కూడా అప్లై చేసి ఉన్నమని, అయితే గత సంవత్సరం నుండి ప్రతి రోజు జన్ను నూతన్ బాబు అనే వ్యక్తి మా స్థలం దగ్గరికి వచ్చి ఈ భూమి పట్ట మాతాత, ముత్తాతలకు సంబంధించి అని గొడువలు చేస్తూ, డబ్బులు రెండు లక్షలు ఇవ్వండి అని, మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తూన్నాడు అని, తన దగ్గర ఉన్న కాగితాలు చూపించు అంటే ఇవ్వడు, ఇలాగే ఒకతను వచ్చి లోల్లిపెట్టి 50వేల రూపాయలు తీసుకెల్లాడని, ఇప్పుడు ఈయన ఇలానే చేస్తుంటే గతంలోనే ఇతనిపైన పోలీస్ స్టేషన్లో గత ఏడాదిలో స్థానిక ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాం అని తెలిపారు. అప్పటి పోలీస్ అధికారి ముందు ఇతను ఇంకోసారి మా జోలికి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు అని, మళ్ళీ సంవత్సరం తరువాత వచ్చి అదే విధంగా లొల్లి చేస్తున్నాడు అని తెలిపారు. మేము 2023లో కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం అని, అయినా కానీ సోమవారం రోజు సోషల్ మీడియాలో వార్తలు రాస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ పైన పిర్యాదు చేశాను అంటూ అనవసర రాద్దాంతం చేయడం సమంజసం కాదని, తన దగ్గర ఉన్న కాగితాలు ఏమి అయిన ఉంటే కోర్టులో తేల్చుకుందాం అని బాధితులు మీడియాతో తెలిపారు. మంగళవారం ఉదయం మళ్ళీ వచ్చి గొడవ చేస్తుండగా 100 డయల్ చేసాము అని పోలీసులు వచ్చే లోపే వెళ్లిపోయాడని, ఇంకోసారి ఇతను మా స్థలం వద్దకు రాకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పోలీసులు మాకు న్యాయం చేయాలని స్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.