నర్సంపేట పోలీస్ శాఖ పట్ల వరంగల్ సిపికి లేఖద్వారా పిర్యాదు.

# ప్రజలు పోలీస్ స్టేషన్ కు వెళ్తే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు.
# ప్రజలను అవమానించే విధంగా పోలీసుల వ్యవహారశైలి.
# బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని పోలీస్ శాఖ పట్ల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాా కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లలో సామాన్య ప్రజలు నేరుగా తమ పిర్యాదులు చేసే పరిస్థితి నేడు లేదన్నారు.గత కొన్ని నెలలుగా పోలీసుల యొక్క మాటతీరు,వ్యవహార శైలి ప్రజలను కించపరుస్తూ అవమానపరిచే విధంగా ఉందని తెలిపారు.ప్రజలు పిర్యాదు చేసే ప్రతీ పిటీషన్ వెనక ఏ పార్టీ వారు ఉన్నారనే కోణంలోనే పోలీసులు పిర్యాదులు స్వీకరిస్తున్నారని అధికార పార్టీ వారి తరపున వచ్చే పిటీషన్లకు మర్యాదగా ప్రవర్తించడం, బీఆర్ఎస్, ఇతర పార్టీ వారి పిర్యాధులైతే అమర్యాదగా ప్రవర్తించడం అనేక సంఘటనలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయని ఆరోపించారు.కొందరు పోలీస్ అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై పిర్యాదులు చేపించటం,దాని పరిష్కారం పేరుతో వసూళ్ళకు పాల్పడటం విచ్చల విడిగా జరుగుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.కొన్ని పోలిస్ స్టేషన్లలో పోలీసు అధికారులు పిటీషన్ దారున్ని నీది ఏ పార్టీ అని ప్రశ్నిస్తున్నారు.పిర్యాదుదారుడు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి అయితే అధికారపార్టీ పిర్యాదు రాకముందే పిటీషనర్ కు వ్యతిరేఖమైన మాటలు,చర్యలు తీసుకుంటున్నారు..ఇటీవల కాలంలో జరిగిన అనేక సంఘటనల్లో పోలీసుల వైఫల్యం,అధికార పార్టీ వారి మాటలకు ప్రభావితం అవుతూ,వారికి దాసోహమై పని చేస్తూన్నారే తప్ప ప్రజల కోసం పోలీసులు పనిచేయడం లేదని వివరించారు.గత కొన్ని నెలలుగా జరుగుతున్న తతంగం,పదుల సంఖ్యల్లో కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు తెన్నులు,ఇతర అక్రమాలపై అన్ని రకాలతో కూడిన ఆధారాలను తమకు అందచేయడానికి సిద్ధంగా ఉన్నామని పెద్ది పేర్కొన్నారు.దీనిపై ప్రత్యేక ఇంటెలిజెన్స్,ఎస్బీ ఎలా రిపోర్ట్ చేస్తున్నారో తెలుయదు కాని డివిజన్ లో జరిగిన అనేక సంఘటన పట్ల ఉన్నత స్థాయి అధికారితో విచారణ చేపడితే అన్ని రకాల ఆదారాలు పోలీస్ అధికారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు.10 ఏండ్లు తాము అధికారంలో ఉన్నాము పరిపాలన సాగించాము.ఎక్కడా కక్షపూరిత రాజకీయాలు,రాజకీయ విద్వేషాలు,అరాచకాలకు పాల్పడలేదని చెప్పారు.శాంతి యుతమైన నర్సంపేట ప్రాంతం నేడు అశాంతి వైపు నడిపే కుట్రచేస్తున్నది ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులే. కుట్రలు చేస్తే ప్రజలు పోలీసుల వద్దకు ఎలా వస్తారు.అలాంటి పోలీసులే ప్రజలకు వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి..శాంతి భద్రతల వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు సైతం మీ ముందు ఉంచుతామని తెలిపారు.
నర్సంపేట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న వసూళ్ళ దందా తతంగం,అరాచకాలు,ప్రజాప్రతినిదులను అగౌరవ పర్చటం,కబ్జాలకు పోలీసులే నిలబడి హద్దులు ఏర్పాటు చేయించడం లాంటీ ఘటనలు,వాటి ఆధారాలు ఉన్నాయి.అనేక దందాలలో పోలీసులు ప్రత్యక్షంగానే పాల్గొంటుండటం బహిరంగ రహస్యం.నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తారు.నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఇప్పటికి 8 మంది ఎస్ ఐ లు మారారు..దుగ్గొండి సర్కిల్ లో 10 నెలల్లో 3 మంది సీఐలు మారటం జరిగింది.చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఇప్పటివరకు 4 గురు ఎస్ హెచ్ఓ లు మారారు.ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో విఫలం చెందాయో అర్థం చేసుకోవచ్చు.దీనికి భాద్యులు ఎవరనేది విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.ప్రశాంతంగా ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో హింస,కక్ష పూరిత రాజకీయాలకు వేదిక చేయడం హేయమైన చర్య.పోలీసులు ఈ అక్రమాలకు అండగా నిలబడటం మంచిది కాదు….ఈ అంశంపై సమీక్ష నిర్వహించి,ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
నర్సంపేట పట్టణంలో మెడికల్ కళాశాల వ్యవస్థాపకునిగా నిర్మించిన కళాశాల ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రిని,మంత్రులను లేఖ ద్వారా ఆహ్వానిస్తే నన్ను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు అన్ని మండలాల నాయకత్వాన్ని జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం పోలీస్ దుశ్చర్యంగా భావిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *