భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రి సూపర్డెంట్ వైద్యుల పై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేశారు ఆస్పత్రికి వచ్చే పేదలకు సకాలంలో వైద్యం అందించడం లేదని చికిత్సలు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు పలువురురోగులకు ఇక్కడి వైద్యులు పరకాల లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపిస్తున్నారు అని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి వంద పడకల ఆస్పత్రి సూపర్డెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు