
Farmer
పంట నష్టపోయిన రైతుకు పరిహారం ఇవ్వాలి
తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలు, గాలివానల కారణం గా పంట నష్టం జరగడంతో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో అకాల గాలి వర్షానికి నష్టం జరిగిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది. మాట్లాడుతూ రైతులు తీవ్ర నష్టానికి గురైన పంటలు వరి, మొక్క జొన్న, అరటి వంటివి నేలకూలి, నాశనమయ్యాయి. ఈ కారణంగా గ్రామాల్లో రైతులు అప్పుల బారిన పడే ప్రమా దంలో ఉన్నదని రైతుల పరిస్థితి నిజంగా హృదయాన్ని కలచివేస్తోంది. కొన్ని కుటుం బాల్లో పంటపై పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి పొందే అవకా శం లేకుండా పోయింది. చాలా మంది రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు కోత కోయక ముందే నాశనం కావడంతో కన్నీటి పర్యంతరం అయ్యారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ రాయరాకుల మొగిలి

మాట్లాడుతూ గాలివాన బీభత్సంతో నోటికాడికి అందిన అన్నం మెతుకులు నేలరాలిన విధంగా పంట నాశనం అయ్యిందని పెట్టుబడి సాగుకు వడ్డీకి అప్పులు చేసి పంటను ఆరుగాలంకస్టించి చేతికందే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యము వలన పంట మొత్తం నేలమట్టం కావడం చాలా దురదృష్టకరమని దీనిపై వెంటనే స్పందించి అధికారులు ప్రభుత్వం రైతులకు తగు న్యాయం చేయాలని
ఈ దారుణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు చేశారు.వెంటనే నష్టం అంచనా వేయడానికి అధికారులను పంపించాలి, ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలి.నష్టపరిహారం మంజూరులో పారదర్శకత ఉండాలి,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను ఈ ఆసంగి పంటకాలానికి కూడా అమలు చెయ్యాలి రైతులసమస్యలను పట్టించుకోకపోతే, బీజేపీ రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, బిజెపినాయకులు, మేకల సుమన్ కోమటి రాజశేఖర్, రైతులు, కోలా మల్లయ్య, కోలా కిషన్, అనుమాండ్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.